Website TemplatesJoomla TemplatesWeb Hosting

మసాల వడ (Masala Vada)

Masala vada1

 

కావలసిన పదార్థాలు:

శనగ పప్పు --- 1 గ్లాసు
ఉల్లిపాయలు  ---- చిన్నవి 2
పచ్చి మిర్చి ---- 3
ఎండు మిరపకాయలు  ---1 లేక 2
ఉప్పు ----తగినంత
సోంపు  --- 1/4 స్పూన్
కరివేపాకు ---- 2 రెమ్మలు
కొత్తిమీర ---2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ ---  1/4  స్పూన్
నూనె --- 2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1. శనగ పప్పు  2  గంటలు  నాన పెట్టుకోవాలి.
2.ఉల్లిపాయ, కొత్తిమీర చిన్నగా  తరుక్కొని  పెట్టుకోవాలి.
3.తరువాత పచ్చి మిర్చి, ఎండు మిరప, అల్లం వెల్లుల్లి పేస్ట్,సోంపు  గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇందులోనె   నానపెట్టిన శనగ పప్పు కూడా వేసి  బరకగా  గ్రైండ్  చేసుకోవాలి . అంటే  మెత్తగా  కాకుండ  మెదిగి మెదగక   గ్రైండ్  చేసుకోవాలి.
5. గ్రైండ్ చేసిన మిశ్రమాన్నిఒక  గిన్నె లో తీసుకొని ,చిన్న గా తరుక్కొన్న ఉల్లిపాయలు, కొత్తిమీర , కరివేపాకు, ఉప్పు వేసి  బాగా  కలపాలి.
6. తరువాత  చిన్న గా వుంట  చేసుకొని  రెండు  చేతుల మధ్యన  పెట్టుకొని  వత్తుకోవాలి .
7.అప్పుడు  గుండ్రంగా  కాకుం డా  ఒవల్  గా వస్తాయి.  
8.ఇలా చేసిన మసాల వడలను నూనె లో ఎర్రగా గా వేయించుకోవాలి.
అంతే  ఎంతో  రుచిగా  ఉండే   మసాల వడ  రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh