ఉద్ది వడ (Urad Vada)
|
|
కావలసిన పదార్థాలు:
ఉద్దిపప్పు --- 1 కప్ |
విధానము:
1.ఉద్దిపప్పు ,1 స్పూన్ శనగ పప్పు 2 గంటలు నాన పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లము బాగా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి.
3.నానపెట్టిన ఉద్దిపప్పు మెత్తగా రుబ్బు కోవాలి.
4.మెత్తగా రుబ్బిన పిండిలో తరిగి ఉంచిన ఉల్లిపాయలు, మిర్చి, అల్లము, కరివేపాకు , ఉప్పు, చిటికెడు వంట సోడ వేసి బాగా కలుపుకోవాలి.
5. స్టవ్ మీద నూనె పెట్టి, వేడి అయ్యాక గుండ్రంగా’ చేసి మధ్య లో రంధ్రం పెట్టి వడ చేసి వేయాలి .
6. ఒక వేల, వడ వేయడం రాకపోతే , ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఒక చుక్క నూనె వేసి , పిండి గుండ్రంగా చేసి, మధ్య లో రంద్రం పెట్టి వడను నూనె లో వేయించాలి.
ఎంతో రుచిగా ఉండే ఉద్ది వడ రెడి.
చిట్కా:ఒక వేల పిండి జారుగా అయితే 2స్పూన్స్ సూజి/ఉప్మా రవ వేసుకొంటే పిండి గట్టిపడి,వడలు వేయడానికి వీలుగా వస్తాయి మరియు వడలు కూడా కరకరలాడుతూ ఉంటాయి.

