Website TemplatesJoomla TemplatesWeb Hosting

పెసర పప్పు వడ (Moong Dal Vada)

కావలసిన పదార్థాలు:

పెసర పప్పు --- 1 గ్లాసు
బియ్యము----1 స్పూన్
ఉల్లిపాయ  ---- 1
అల్లం---చిన్న ముక్క 
పచ్చి మిర్చి ---- 4
ఉప్పు ----తగినంత
కరివేపాకు ---- 2 రెమ్మలు
నూనె --- 2 కప్స్ (వేయించడానికి)

విధానము:

1. పెసరపప్పు  2 గంటలు  నాన పెట్టుకోవాలి.
2.ఉల్లిపాయ , అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు  చిన్నగా  తరుక్కొని  పెట్టుకోవాలి.
3.తరువాత  నానపెట్టిన  పెసర పప్పు కూడా వేసి  బరకగా  గ్రైండ్  చేసుకోవాలి . అంటే  మెత్తగా  కాకుండ  మెదిగి మెదగక   గ్రైండ్  చేసుకోవాలి.
4. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని  ఒక  గిన్నె లో తీసుకొని ,చిన్న గా తరుక్కొన్న ఉల్లిపాయలు, కరివేపాకు ,అల్లం, మిర్చి, ఉప్పు వేసి  బాగా  కలపాలి.
5. తరువాత  చిన్న గా వుంట  చేసుకొని   రెండు  చేతుల  మధ్యన  పెట్టుకొని  వత్తుకోవాలి .
6.అప్పుడు  గుండ్రంగా  కాకుండా  ఒవల్  గా వస్తాయి.  
7.ఇలా చేసిన  పెసర పప్పు  వడలను  నూనె లో ఎర్రగా  గా  వేయించుకోవాలి.
అంతే  ఎంతో  రుచిగా  ఉండే   పెసర వడ  రెడి .
* ఇదే పిండి తో రంద్రం  పెట్టకుండా , పకోడి లా కూడా వేసుకోవచ్చు.

 

 
haseena:
hai
Tuesday, 15 November 2011 08:31

Add your comment

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh