Website TemplatesJoomla TemplatesWeb Hosting

పెసర పప్పు-పాలకూర వడ (Moong Dal-Spinach Vada)

కావలసిన పదార్థాలు:

పెసర పప్పు --- 1 గ్లాసు
పాలకూర----1/2 కట్ట
బియ్యము----1 స్పూన్
ఉల్లిపాయ   ---- 1
అల్లం---చిన్న ముక్క 
పచ్చి మిర్చి ---- 4
ఉప్పు ----తగినంత
కరివేపాకు ---- 2 రెమ్మలు
నూనె --- 2 కప్స్ (వేయించడానికి) 

విధానము:

1. పెసరపప్పు  2  గంటలు  నాన పెట్టుకోవాలి.
2. పాలకూర, ఉల్లిపాయ , అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు  చిన్నగా  తరుక్కొని  పెట్టుకోవాలి.
3.తరువాత  నానపెట్టిన  పెసర పప్పు కూడా వేసి  బరకగా  గ్రైండ్  చేసుకోవాలి . అంటే  మెత్తగా  కాకుండ  మెదిగి మెదగక   గ్రైండ్  చేసుకోవాలి.
4. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని  ఒక  గిన్నె లో తీసుకొని ,చిన్న గా తరుక్కొన్నపలకూర, ఉల్లిపాయలు,కరివేపాకు,అల్లం,మిర్చ్చి, ఉప్పు వేసి  బాగా  కలపాలి.
5. తరువాత  చిన్న గా వుంట  చేసుకొని   రెండు  చేతుల  మధ్యన  పెట్టుకొని  వత్తుకోవాలి .
6.అప్పుడు  గుండ్రంగా  కాకుండా  ఒవల్  గా వస్తాయి.  
7.ఇలా చేసిన  పెసరపప్పు-పాలకూర  వడలను  నూనె లో ఎర్రగా  గా  వేయించుకోవాలి.
అంతే  ఎంతో  రుచిగా  ఉండే   పెసర పప్పు-పాలకూర  వడ  రెడి .
*ఇదే పిండి తో రంద్రం పెట్టకుండా ,పకోడి లా కూడా వేసుకోవచ్చు.

 

 

Add your comment

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh