Website TemplatesJoomla TemplatesWeb Hosting

గుంత పొంగనాలు/పొంగనాలు(Guntaponganalu)

ponganalu3

కావలసిన పదార్థాలు:

దోస పిండి---3 కప్స్
ఉల్లిపాయలు--2
పచ్చి మిర్చి---3
అల్లం--చిన్న ముక్క
కొత్తిమీర---2 రెమ్మలు
నూనె---1 స్పూన్
ఉప్పు---తగినంత
జీలకర్ర--1/4 స్పూన్
ఆవాలు---1/4 స్పూన్
ఇంగువ--చిటికెడు

విధానము:

1.ఉల్లిపాయలు,పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

2.బానలి లో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ  తిరగమాత వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

3.ఒక గిన్నె లో దోస పిండి వేసి, అందులోకి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, తిరగమాత వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొంగనాలకు పిండి రెడి అయ్యింది.

ponganalu1

 4.తరువాత పొంగనాల పెనం లో నూనె రాసి తయారు చేసుకున్న దోస పిండి వేసుకోవాలి.

ponganalu2

5.తరువాత పెనం లో వేసుకోన్న పిండిని స్టవ్ మీద పెట్టి, మూత పెట్టాలి.

6.తరువాత పొంగనాలు బాగా ఉడికినాక (కొంచం లావుగా అయ్యాక)రెండో వైపు కూడా తిప్పి ఉడకనివ్వాలి.

7.ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు రెడి.పొంగనాలు వేరు శెనగపప్పు పచ్చడి లేక కొబ్బరి పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది. 

ponganlu3

గమనిక:పొంగనాల పెనం నాన్ స్టిక్  అయితే నూనె వేయనక్కర లేదు.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh