ఆలు బజ్జి (Potato Bajji)
|
ఆలుగడ్డలు--3 శనగ పిండి---1 1/2 కప్ జీలకర్ర పొడి---1 టీ స్పూన్ ఎర్ర కారం--1 టీ స్పూన్ ఉప్పు---తగినంత పసుపు--1/4 స్పూన్ ఇంగువ--చిటికెడు |
విధానము:
1.ఆలుగడ్డలు బాగా కడిగి, గుండ్రంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి.(నీళ్ళలో వేయడం వల్ల ఆలుగడ్డలు నల్లగా కాకుండా ఉంటాయి)
2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.
3.నూనె వేడికి పెట్టాలి.
4.నూనె వేడి అయ్యాక, పిండిలో గుండ్రంగా తరిగిన ఆలుగడ్డలు ముంచి, నూనె లో వేయాలి.
5.ఆలుగడ్డలు రెండు వైపులా గోధుమ రంగు లో వేగినాక ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే ఆలుగడ్డ బజ్జి రెడి.

