Website TemplatesJoomla TemplatesWeb Hosting

మిర్చి బజ్జి (Mirchi Bajji)

mirchi bajjiకావలసిన పదార్థాలు:

లావు మిరపకాయలు--10-15

శనగ పిండి---11/2 కప్

జీలకర్ర పొడి---1 టీ స్పూన్

ఎర్ర కారం--1 టీ స్పూన్

ఉప్పు---తగినంత

పసుపు--1/4 స్పూన్

ఇంగువ--చిటికెడు

విధానము:

1. మిరపకాయలు బాగా కడిగి, మధ్యకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2.ఒక గిన్నె లో శనగ పిండి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా నీరు వేసి జారుగా కాకుండా, పకోడి పిండి లా కలుపుకోవాలి.

3.నూనె వేడికి పెట్టాలి.

4.నూనె వేడి అయ్యాక, పిండిలో మధ్యకు కట్ చేసిన మిరపకాయలు ముంచి, నూనె లో వేయాలి.

5.మిరపకాయలు గోధుమ రంగు వచ్చేలా వేగినాక  ప్లేట్ లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే మిర్చి బజ్జీ రెడి.

గమనిక: ఉల్లిపాయలు ఇష్టమున్న వారు, మిర్చి బజ్జీలు మధ్యకు కట్ చేసి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

mirchi bajji

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh