మద్దూరు వడ (Madduru Vada )
|
|
విధానము:
1.ఉల్లిపాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2.వేరు శనగ విత్తనాలు వేయించి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3.పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4.తరువాత ఒక గిన్నె లో బియ్యప్పిండి, బొంబాయి రవ, మైదా వేయాలి

5.తరువాత సోడ, ఇంగువ వేసి బాగా కలపాలి.

6.తరువాత గ్రైండ్ చేసిన వేరు శనగ పొడి, పచ్చి మిర్చి మిశ్రమము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
7.చివరిలో నువ్వులు వేయాలి.

8.తరువాత తగినంత ఉప్పు వేసి మిశ్రమం బాగా కలిసేలా కలపాలి.

9.తరువాత దానిపై నూనె వేసి ముద్దగా కలపాలి.

10.ఇప్పుడు మద్దూరు వడ మిశ్రమం తయారు అయ్యింది.

11.ఇలా తయారు అయిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.
12.తరువాత చిన్న గా చేసుకున్న ఉంటను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి వత్తాలి.

13.ఇలా వత్తిన వడలను నూనె లో వేయించాలి.
14.తరువాత వేయించిన వడలను ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే మద్దూరు వడ రెడి. ఈ వడ సాస్/కొబ్బెర పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

గమనిక:మద్దూరు వడ పిండి కలిపేటప్పుడు నీరు వాడకుండా నూనె తో కలిపితే చాలా బాగుంటుంది.
2.నూనె ఎక్కువ అవుతుంది అనుకునేవారు 3/4 నూనె,1/4 నీరు వేసుకొని కూడా పిండి కలుపుకోవచ్చు.

