Website TemplatesJoomla TemplatesWeb Hosting

మూర్కలి/పెరుగు ఉప్మా(Moorkali/Curd Upma)

moorkaliకావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి--1 కప్

పెరుగు--1 కప్

పచ్చి మిర్చి--2

నూనె--4-5 స్పూన్స్

ఆవాలు--1/2 టీ స్పూన్

కరివేపాకు ఆకులు--5

ఉప్పు -- తగినంత
 

విధానము:

1.ఒక గిన్నె లో బియ్యప్పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీరు వేసి  ముద్దగా చేసుకోవాలి.

2.పెరుగు బాగా చిలికి, కొద్దిగా నీరు వేసి జారుగా చేసుకోవాలి.

3.బానలి పెట్టి నూనె వేసి, నూనె వేడి అయ్యాక ఆవాలు, చిన్నగా తరిగిన  పచ్చి మిర్చి వేయాలి.

4.తరువాత బియ్యప్పిండి-ఉప్పు కలిపిన మిశ్రమాన్ని, జారుగా కలిపిన పెరుగు  వేసి బాగా కలపాలి.

5.తరువాత కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.

6.తరువాత మూత పెట్టి 3-5 నిముషాలు ఉడికించాలి.

7.తరువాత మూత తీసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే మూర్కలి/పెరుగు ఉప్మా రెడి.ఇది ఎదైన ఊరగాయ తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh