చుడువా/మసాల అటుకులు(Chuduva/Masala Poha)
|
కావలసిన పదార్థాలు: అటుకులు--1/2 కేజి విధానము: 1.స్టవ్ మీద ఒక పెద్ద బాణలి లో అటుకులు వేసి కొద్దిగా వేడి అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.(నూనె వేయకుండా) 2.వేరు శనగ విత్తనాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. 3.తరువాత బాణలి లో నూనె వేసి వేడి అయ్యాక, ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగినాక, స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ ,పసుపు, కారం, కరివేపాకు, జీడిపప్పు, వేరు శనగ పప్పు, కొబ్బెర ముక్కలు, పప్పులు వేసి బాగా కలపాలి. 4.తరువాత అందులోకి వేయించిన అటుకులు వేసి బాగా కలపాలి. 5.చివరిలో 2 స్పూన్స్ చెక్కర వేసి కలపాలి. ఎంతో రుచిగా ఉండే చుడువా/మసాల అటుకులు రెడి.
|


