Website TemplatesJoomla TemplatesWeb Hosting

మసాల వడ(Masala Vada/Mixed dal vada)

masala vada


కావలసిన పదార్థాలు:

శనగ పప్పు--1 కప్
ఉద్దిపప్పు--1/4 కప్
పెసర పప్పు--1/4 కప్
అల్లం--చిన్న ముక్క
కొత్తిమీర--2 రెమ్మలు
కరివేపాకు--2 రెమ్మలు
పుదీన--2 రెమ్మలు
ఉల్లిపాయ--1
ఉప్పు-- తగినంత
నూనె--(వేయించడానికి)

విధానము:

1.శనగపప్పు,ఉద్దిపప్పు,పెసరపప్పు మూడు కలిపి 3-4 గంటలు నాన పెట్టాలి.

2.తరువాత నాన పెట్టిన  పప్పులను బరకగా గ్రైండ్ చేయాలి.

3.తరువాత గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నె లో తీసుకోవాలి.

4.తరువాత  అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కలపాలి.

5.తరువాత  గ్రైండ్  చేసిన అల్లం, కరివేపాకు, పుదీన, కొత్తిమీర పేస్ట్ కలపాలి.

6.తరువాత ఇంగువ వేయాలి.

7.తరువాత తగినంత ఉప్పు వేయాలి.

8.పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

9.స్టవ్ ఆన్  చేసి నూనె వేడికి పెట్టాలి.

10.పిండిని కొద్దిగా తీసుకొని ప్లాస్టిక్ పేపర్ పై పెట్టి వత్తాలి.

11.ఇలా వత్తిన వడలను వేడి నూనె లో వేసి వేయించాలి.

12.తరువాత వేయించిన వడలను ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే మసాల వడ రెడి.
 

 

 
Comments (2)
2 Sunday, 23 October 2011 19:33
Madhavi
thank you Krishnaveni garu
1 Friday, 21 October 2011 10:21
all items or good tast

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh