Website TemplatesJoomla TemplatesWeb Hosting

కర్జూరం బిస్కెట్స్ (Dates Biscuits)

కావలసిన పదార్థాలు :

మైదా------------ 1 గ్లాసు
చెక్కర పొడి ------1/2 గ్లాసు
వెన్న -------------1/2 గ్లాసు
ఎండుకర్జూరము  ----------1/2 గ్లాసు
బేకింగ్ పౌడర్ ---------1/2 స్పూన్
బేకింగ్ సొడా  ----------1/2 స్పూన్
గుడ్డు (తెల్లసొన మాత్రమే)----1 గుడ్డు
ఉప్పు ---------చిటికెడు

విధానము

1.ఎండు కర్జూరము లో గింజలు తీసి నున్నగా పొడి చేసుకోవాలి.
2. మైదా లో బేకింగ్ పౌడర్ , బేకింగ్ సోడా , ఎండుకర్జూరం పొడి , చిటికెడు ఉప్పు వేసి ,బాగా కలిపి పక్కన పెట్టు కోవాలి.
3. ఒక  గిన్నెలో  గుడ్డు  పగుల  కొట్టి   తెల్ల సొన  ను వేసుకోవాలి. (ఇష్టం లేనివారు గుడ్డు వేసుకోకండి) 
4. అందులో కి  చెక్కర పొడి, వెన్న  వేసి బాగా నురగ వచ్చెలా  కలపాలి.
5. ఇందులో  కొంచం  కొంచం  మైదా  వేస్తూ, పూరి పిండి లా గట్టిగా కలుపుకోవాలి.
6. వెంటనే  గాలి  తగలకుండా  మూత పెట్టాలి.  
7. కొంచం కూడా నీళ్ళు వాడరాదు.   
8. ఇలా మూత పెట్టిన  పిండి ను 6  లేక 7 గంటలు నాననివ్వాలి.
9 .తరువాత  నానిన పిండి ని తీసి చపాతి  కన్నా కొంచం మందంగా  వత్తుకొవాలి.
10. ఇలా వత్తిన చపాతిని  మీకు  నచ్చిన  విధంగా  గుండ్రంగా  డైమండ్ లా, స్వయర్ గా , కట్  చేసుకోవచ్చు.
11.ఇలా  చేసుకున్న  బిస్కెట్స్  ను  ఒవన్ లో పెట్టి 25 నుంచి 30 నిముషాలు గోదుమ రంగు వచ్చే లా  బేక్ చేసుకోవాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే డేట్స్ బిస్కెట్స్  రెడి.

చిట్కా: కర్జూరం  బలానికి చాలా మంచిది. నడుము నొప్పి కి ,ఎముకనొప్పి కి చాలా బాగా పనిచేస్తుంది.
గమనిక: బిసికెట్స్ కు  పిండి ముద్దగా రాకపొతే,నీళ్ళతో  కలపకండి .కావాలంటే పాలు వేసుకోవచ్చు.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh