బాసుంది (Basundi)
![]() |
కావలసిన పధార్థాలు : చిక్కని పాలు ---- 1 లీటర్ |
విదానము:
1. నెయ్యి లో జీడిపప్పు , సారపప్పు , బాదం దోరగా వేయించుకోవాలి.
2.మందంగా వున్న గిన్నె లో పాలు పోసి , మీగడ రాకుండా , అడుగు అంటకుండా తిప్పుతూ వుండాలి.
3. పాలు ఎర్రగా , చిక్కగా అయ్యాక అందులో చెక్కర వేయాలి.
4. చెక్కెర వేయగానె , పాలు పల్చబడతాయి . అప్పుడు పాలు,చెక్కర కలిపి అడుగు అంటకుండా చిక్కబడ్డాక, స్టవ్ ఆఫ్ చేసి అందులో ఏలక్కుల పొడి ,కుంకుమ పువ్వు వేయాలి.
5.అలాగే నెయ్యి లో వేయించిన చారపప్పు,జీడిపప్పు,బాదం కూడా వేయాలి.
ఎంతో రుచిగా వుండే బాసుంది రెడి.
చిట్కా: బొట్టు పెట్టుకునే చోట మచ్చ పడితే , కుంకుమ పువ్వు తో రుద్దితే ఆ మచ్చ పోతుంది.

