Website TemplatesJoomla TemplatesWeb Hosting

నిమ్మ పూరీలు (Lemon Puri)

lime puuriకావలసిన పధార్థాలు :

మైదా ---- 1 కప్
చెక్కర ----- 1 కప్
నెయ్యి ----- 1 కప్
వెన్న/బటర్  -----3 స్పూన్స్
నిమ్మకాయలు ---- 2
ఉప్పు ----- చిటికెడు
నిమ్మ ఎసెన్స్ ---- చిటికెడు
ఎరుపురంగు  -----1/4స్పూన్స్

విధానము:

1.మైదా లో చిటికెడు ఉప్పు , వెన్న/బటర్, వేసి కొంచం నీరు వేసి పూరి పిండి లాగ కలుపుకోవాలి.
 (పూరి లాగ చేయడం ఇష్టం లేకపోతె చేగొడి లా చేసుకోవచ్చు.అంటే ఒక పీటమీద దారం లా పొడవు గా చేసి చుట్టుకోవాలి)
2.ఒక గిన్న లో చెక్కర వేసి కొంచం నీరు వేసి తీగపాకం పట్టుకోవాలి.
3.స్టవ్ ఆఫ్ చేసి,  అందులోకి  కొంచం పాల లో కలిపిన ఎరుపురంగు వేయాలి.
4. తరువాత  పాకం లో  గింజలు  లేకుండా  నిమ్మ కాయ రసం పిండాలి . నిమ్మ వాసన బాగ కావలి అనుకున్న వారు నిమ్మ ఎసెస్న్ వేసుకోవచ్చు.    
5. తరువాత  బానలి లో  నెయ్యి వేసి , వేడి అయ్యాక పూరి పిండి ను  చిన్న వుంట గా తీసుకొని ,పూరి లేక చేగొడి లా చేసుకొని, నెయ్యి లో  గోధుమ రంగు వచ్చేలా వేయించుకోవాలి.   
6. ఇలా  వేయించిన  పూరి/చేగొడి  లను పాకం లో వేయాలి.
7.ఈ పూరిలు  వేడి  వేడి  గా  తింటే చాల బాగుంటాయి. 

చిట్కా: నిమ్మ రసం లో కొంచం  తేనే  ,నీరు వేసి , పడ కడుపున తాగితే సన్నగా అవుతారు.
నిమ్మ రసం లో కొంచం నీరు, 1/2 స్పూన్ చెక్కర వేసుకొని ,తాగితే గుండెదడ తగ్గుతుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh