అరటిపండు పూరీలు (Banana Puri)
|
కావలసిన పధార్థాలు : మైదా ---- 1 కప్ |
విదానము:
1. 4 అరటిపండ్లు తొక్కు తీసి బాగ గుజ్జు చేసుకోవాలి.
2. యాలక్కులు పొడి చేసుకోవాలి.
3. బాదాం అరగంట నీల్ల లో నానపెట్టి , పొట్టు తీసి ,చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
4. కలకండ నున్న గా ,మెత్తగా పొడి చేసుకోవాలి.
5. నెయ్యి లో ద్రాక్ష,జీడిపప్పు వేయించుకోవాలి.
6. అలాగే నెయ్యి లో మైదా కుడా గోధుమ రంగు లో వేయించాలి.
7. నెయ్యి లో వేయించిన మైదా లో ,అరటిపండు గుజ్జు , ద్రాక్ష , జీడిపప్పు, ఏలకులపొడి , వెన్న/బటర్ వేసి బాగ కలిపి పూరి పిండి లా తయారు చేసుకోవాలి.
8. బానలి లో నెయ్యి వేసి వేడి అయ్యాకా తయారు చేసుకున్న పిండిని చిన్న వుంట తీసుకొని , చేతి మీద గాని లేక ప్లాస్టిక్ పెపర్ మీద గాని ,అప్పాలు చేసుకోవాలి.
9. ఇలా నెయ్యి లో వేయించిన పూరీ లపై కలకండ పొడి చల్లుకోవాలి.
10. వేడి మీద కలకండ పొడి చల్లితే కలకండ పొడి రాలిపోకుండా వుంటుంది.
అంతే ఎంతో రుచిగా వుండే అరటిపండు పూరీ రెడి .
చిట్కా: ఈ పూరీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది,ఎందుకంటె ఇందులోఅరటి పండు,కలకండ,నెయ్యి, డ్రైఫ్రూట్స్ అన్నివున్నాయి కాబట్టి,బలం వస్తుంది.మరియు కిడ్నికు, పైత్యశాంతి కి కూడ మంచిది.
