Website TemplatesJoomla TemplatesWeb Hosting

మైసుర్ పాక్(Mysore paak)

mysorepak

కావలసిన పధార్థాలు :

శనగ  పిండి  -----1 గ్లాసు
చెక్కర -----   1 గ్లాసు
డాల్డ  ----- 1/4  గ్లాసు
నెయ్యి  ---- 1 గ్లాసు
బేకింగ్  పౌడర్  ---- 1/4 స్పూన్

విధానము:

1.నెయ్యి, డాల్డ  కరిగించి పెట్టు కోవాలి.
2.ఒక ప్లెట్ కు 1/2 స్పూన్ నెయ్యి  పూసి వుంచు కోవాలి.
3.1 స్పూన్  నెయ్యి వేసి, శనగపిండి పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
4.ఒక బానలి పెట్టి, అందులో చెక్కెర  వేసి , కొంచం  నీరు  వేసి ,చెక్కర  కరిగే దాక వుంచాలి.
5.తరువాత కరిగిన  చెక్కర  లోకి, శనగపిండి  కొంచం  కొంచం  వేస్తూ వుంటలు లేకుండా కలపాలి.
6.తరువాత కొంచం కొంచం డాల్డా,నెయ్యి వేస్తూ బాగా కలపాలి.
7. డాల్ద, నెయ్యి బాగా  పీల్చుకున్నాక, 1/2 స్పూన్  బేకింగ్  పౌడర్ వేసి ,బాగా కలపాలి.
8 .పిండి గిన్నె అంచులకు  అంటకుండా  ఒక బాల్  లాగా  తిరుగుతుంది .
9. అప్పుడు   వెంటనే   తీసి , నెయ్యి పూసి వుంచిన  ప్లెట్ లో వేయాలి.

mysore pak

10.తరువాత బిల్లలు బిల్లలు  గా కత్తి తో కట్ చేసుకోవాలి. 

mysore pak

అంతే ఎంతో రుచిగా ఉండే  మైసుర్ పాక్ రెడి.

చిట్కా: శనగపప్పు  బలాన్ని  ఇస్తుంది. అంతే కాదు  ఊపిరితిత్తులకు, మూత్రపిండాలకు,లివర్ కు కుడా శక్తిని ఇస్తాయి.ఎక్కువ  తింటే  అజీర్తి  చేస్తుంది.మితంగా తినడం మంచిది.

 
Comments (4)
4 Wednesday, 05 October 2011 15:56
Madhavi
latagaru water chekkara munigea laa veyali
3 Wednesday, 05 October 2011 10:16
latha
madam water qty entha vundali?
2 Friday, 22 October 2010 14:18
Madhavi
Shirisha gaaru ..paakam emi avasaram ledu..just chekkara poortigaa karigitea chaalu.
1 Friday, 22 October 2010 10:58
Sugar soup pakam enta ravali?

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh