కొబ్బెర బొబ్బట్టు (Coconut Bobbattu)
|
పచ్చి కొబ్బెర తురుము ---- 2 గ్లాసులు |
విధానము:
1. మైదా పిండి లో కొంచం నీరు వేసి , పూరీ లాగ కలుపుకొని , 1 కప్ నూనె వేసి , బాగ కలిపి 1 గంట నాన పెట్టుకోవాలి.
2.ఒక గిన్నె తీసుకొని , అందులోకి పచ్చికొబ్బెర , బెల్లం తురుము , ఏలక్కుల పొడి , గసాలు, జీడిపప్పు పొడి, వేసి బాగా కలుపుకోవాలి
3. కావాలి అనుకుంటే బాదాం కుడా పొడి చేసి వేసుకోవచ్చు.
4.ఇలా కలిపిన మిస్రమాన్ని , కొబ్బెర పూర్నం అంటారు . ఒక వేల పూర్నం జారుగా వస్తే , 5 నిముషాలు స్టవ్ మీద పెట్టి కొంచం గట్టి పడినాక బాగా కలిపి దించేయండి.
5. సాద్యమైనంత వరకు పూర్నం , గట్టిగా వుండేలా చూసుకోండి .
6.తరువాత ఇలా చేసుకున్న , కొబ్బెర పూర్నాలను , గుండ్రంగా వుంటలు గా చేసుకోవాలి.
7.తరువాత నాన పెట్టిన మైదా పిండి చిన్న వుంట తీసుకొని , చేతిమీద పల్చగా చేసుకొని అందులో పూర్నం వుంట పెట్టి , ఒక బాల్ లాగ చుట్టాలి.
8.అంటే పూర్నం చుట్టూ మైదా తో కప్పెయాలి.
9.ఇలా చేసుకున్న మిస్రమాన్ని, ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కాని , అల్యూమినియం పేపర్ మీద గాని , అరటి ఆకు మీద కాని, కొంచం నూనె వేసి పల్చగా చేతితో వత్తుకోవాలి.
10.ఒక వేల మీకు వత్తడం రాకపోతే చపాతి కర్రతో వత్తుకోవాలి . వత్తేటప్పుడు మొదట చివరన చేసి , తరువాత మధ్యలో వత్తాలి.
11.ఇలా చేసిన బొబ్బట్టు ను పెన్నం మీద వేసి , కొంచం కాగాక తిప్పి, నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
12. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి .
అంతే ఎంతోరుచిగా వుండే కొబ్బెరబొబ్బట్టు రెడి.
చిట్కా: కాఫీ /టీ లో , చెక్కర ఎక్కువ ఐతే , మీరు పాలు వేసుకోకుండా, మీ నొట్లొకి 1/2 స్పూన్ చెక్కర వేసుకోండి. అప్పుడు మీకు తీపి అనిపించదు.
కావలసిన పదార్థాలు :