Website TemplatesJoomla TemplatesWeb Hosting

చెక్కర బొబ్బట్టు (Sugar Bobbattu)

కావలసిన పదార్థాలు :

sugar bobbattuశనగపప్పు -----------1 గ్లాసు
చెక్కర ----- 1 గ్లాసు
మైదా  ------1 గ్లాసు
కొబ్బెర ---- 1/2 కప్  
లక్కుల పొడి  -----1 స్పూన్
నూనె ------------1 కప్
గసాలు ------2 స్పూన్స్

విధానము:

1. మైదా  పిండి  లో  కొంచం  నీరు  వేసి  , పూరీ  లాగ  కలుపుకొని ,  1 కప్  నూనె వేసి , బాగ కలిపి 1   గంట నాన పెట్టుకోవాలి.
2.శనగపప్పు ,  తగినంత  నీరు  వేసి  , కుక్కర్  లో  పెట్టి  ,2  విసిల్స్ వచ్చాక తీసి పక్కన  పెట్టుకోవాలి.
3.శనగపప్పు లో , నీరు వుంటే  , తడి బట్ట పైన  కాని లేక  పెపర్ మీద కాని వేసి,  తడి  లేకుండా   ఆరపెట్టుకోవాలి.
4 .ఒక గిన్నె  తీసుకొని , అందులోకి  ఉడికించిన శెనగపప్పు , చెక్కర , కొబ్బెర ,ఏలక్కుల పొడి ,గసాలు వేసి బాగా కలుపుకోవాలి.
5.ఇలా కలిపిన మిస్రమాన్ని పూర్నం అంటారు. ఒక వేల పూర్నం  జారుగా వస్తే , 5 నిముషాలు స్టవ్ మీద పెట్టి  బాగా  కలిపి  దించేయండి .
6 .పూర్నం  చల్లగా  అయ్యాక  ,   గట్టిపడుతుంది  .సాద్యమైనంత వరకు పూర్నం గట్టిగా వుండేలా  చూసుకోండి.   
7.తరువాత  ఇలా  చేసుకున్న పూర్నం  ను  గుండ్రంగా  వుంటలు గా చేసుకోవాలి.   
8.తరువాత నాన   పెట్టిన మైదా పిండి చిన్న వుంట  తీసుకొని ,చేతిమీద పల్చగా చేసుకొని అందులో పూర్నం వుంట పెట్టి ఒక బాల్ లాగ చుట్టాలి.
9.అంటే పూర్నం  చుట్టూ  మైదా  తో కప్పెయాలి.
10.   ఇలా చేసుకున్న  మిస్రమాన్ని  ఒక ప్లాస్టిక్  పేపర్  మీద  కాని ,  అల్యూమినియం పేపర్   మీద  గాని , లేక అరటి ఆకు మీద కాని ,    కొంచం నూనె వేసి పల్చగా చేతితో వత్తుకోవాలి.
11.ఒక  వేల మీకు వత్తడం  రాకపొతే ,  చపాతి  కర్రతో  వత్తుకోవాలి . వత్తే టప్పుడు  ,మొదట చివరన చేసి తరువాత మధ్యలో  వత్తాలి.
12.ఇలా చేసిన బొబ్బట్టు ను  , పెన్నం  మీద వేసి కొంచం  కాగాక  , తిప్పి నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
13.రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి .

 అంతే ఎంతోరుచిగా వుండే చెక్కర  బొబ్బట్టు  రెడి.
 
Comments (2)
2 Tuesday, 15 February 2011 14:20
Madhavi
pesarapappu to kuda chesukovachchu....kani Sanagapappu taste varugaa untundi..pesarapappu taste different gaa untundi...rendu differnt taste to baguntayi.
1 Thursday, 30 December 2010 19:31
chanagapappu ki badulu pesarapappu vadite baga rava?maku adi dorakadu.anduke

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh