Website TemplatesJoomla TemplatesWeb Hosting

దూద్ పెడ (Dood peda)

                                                            

pala kova-4

కావలసిన పధార్థాలు :

మిల్క్ పౌడర్ ---- 1 కప్
కండెన్సుడ్ మిల్క్ ---- 1 కప్
బటర్(వెన్న)  ---- 4 స్పూన్స్
బాదాం ---( కోవా  పై  పెట్టడానికి
)

విధానము:

1.ఒక గ్లాస్ బవుల్  (గ్లాసు గిన్నె)  లో  మిల్క్ పౌడర్,  కండెన్సుడ్ మిల్క్, బటర్ వేసి , బాగా కలిపి  మైక్రో వెవ్ లో  పెట్టి 4  నిముషాలు  పెట్టాలి.
2.తరువాత తీసి బాగా కలిపి ,  1 నిముషం పెట్టాలి బాగా పొంగి నాక తీసెయాలి. ఒక వేల పచ్చివాసన పోకపోతే మరొక నిముషం పెట్టుకోవచ్చు.
3.తరువాత ఇలా తయారు  ఐన  కోవా  పిండి  ని  , చిన్న చిన్న వుంటలు గా  చేసి  , రెండు  చేతుల  మధ్య  పెట్టి వత్తాలి.
4.అప్పుడు  కోవా పలుచగా గుండ్రంగా వుంటుంది.
5. ఇలా  చేసిన వాటి  మధ్య లో ,  బాదాం  కాని , జీడిపప్పు   గాని , చెర్రిస్  గాని  పెట్టుకుంటే  చాలా  బాగుంటుంది.
(ఇష్టమున్న వారు మురుకులు లేక చెక్కిలాలు చేసే బిల్లలతో మీకు నచ్చిన ఆకారం లో, అచ్చులుగా వేసుకోవచ్చు).

ఎంతో రుచిగా ఉండే  మైక్రో వెవ్ దూద్ పెడ రెడి.

Pala kova-1

చిట్కా:  రోజు పడకడుపున మూడు బాదాం  లు నాన పెట్టుకొని పిల్లలకు గాని,పెద్దలు గాని తింటే చాలా  బలం ఇస్తుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh