కేసరి హల్వా (Kesar Halwa)
![]() |
కావలసిన పదార్థాలు: (ముగ్గురికి సరిపడా) బొంబాయి రవ/ సూజి రవ--- 1 కప్ |
విధానము:
1.బానలి లో 1 స్పూన్ నెయ్యి వేసి సూజి/బొంబాయి రవను, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
2.చెక్కర, వేయించిన రవను కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. బానలి లో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు ,ద్రాక్ష వేయించాలి.
4. జీడిపప్పు దోరగా వేగినాక ,2కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.
5.మర్లుతున్న నీళ్ళలో చిటికెడు కేసర్ కలర్/కుంకుమ పువ్వు నీళ్ళలో లేక పాల లో కలిపి వేయాలి.
6.తరువాత కేసర్ కలిపిన, మర్లుతున్న నీళ్ళ లో పక్కన పెట్టుకున్న సూజి+చెక్కర వేసి, ఉంటలు లేకుండా కలపాలి.
7.కేసర్ కలిపిన నీళ్ళ లో సూజి ,చెక్కర బాగా కలిసాక , హల్వా లా తయారు అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే హల్వా రెడి.

