కర్జూరం కేక్ (Dates Cake)
![]() |
కావలసిన పదార్థాలు: (12 కకె ఫీసెస్) కర్జూరం పండ్లు---15 |
విధానము:
1.బాదం పొడి చేసుకోవాలి.(కర్జూరం లో గింజలు తీసేయాలి)
2.పుల్ల పెరుగు లో కర్జూరము వేసి, 1 గంట నానపెట్టుకోవాలి.
3.తరువాత పెరుగు లో నాన పెట్టిన కర్జూరము గ్రైండ్ చేసుకోవాలి.
4.ఒక గిన్నె లో మైదా ,కార్న్ స్టార్చ్, బేకింగ్ పౌడర్, బాదం పొడి, చెక్కర, పెరుగు లో గ్రైండ్ చేసిన కర్జూరము ,వేసి బాగా కలపాలి. కవ్వము తో చిలికితే బాగా కలుస్తుంది.
5.తయారు చేసుకున్న పిండి గట్టిగా ఉంటే 1/2 కప్ నీరు వేసి కలపాలి.
6.పిండి జారుగా చేసుకొని, కవ్వం తో బాగా కలిసేలా కలపాలి.
7.తరువాత మైక్రోవేవ్ గిన్నె (గ్లాస్ బవులు) తీసుకొని లో కలిపిన మిశ్రమాన్ని వేసి 5 నిముషాలు పెట్టాలి .తరువాత 1 నిముషము పెట్టాలి.
8.కేక్ బాగా పొంగి కొంచం ఎర్రగా మారుతుంది.
9.తరువాత ఒక పుల్ల తీసుకొని కేక్ పైన గుచ్చితే, పుల్లకు అంటకుండా రావాలి.
10.ఒక వేల కేక్ పచ్చిగా (ఉడకకపోతే) ఉంటే మరొక నిముషం పెట్టి వేడి చేయాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే కర్జూరం కేక్ రెడి.
గమనిక : పెరుగు బాగా పుల్లగా ఉంటే కేక్ బాగా వస్తుంది.

