Website TemplatesJoomla TemplatesWeb Hosting

పైనాపిల్ కేసరి హల్వా (Pineapple kesar halwa)

pinaple halwa

కావలసిన పదార్థాలు: (ముగ్గురికి  సరిపడా)

బొంబాయి రవ/ సూజి రవ--- 1 కప్
పైనాపిల్ ముక్కలు(స్లైసెస్)---4  చెక్కర--- 1 కప్
జీడిపప్పు--- 1 స్పూన్
ద్రాక్ష----1 స్పూన్
ఏలక్కుల పొడి---1/4 స్పూన్
నెయ్యి----4 స్పూన్స్
పాలు/నీళ్ళు----2 కప్స్
కుంకుమ పువ్వు/ కేసరి కలర్---చిటికెడు



విధానము

1.బానలి లో 1 స్పూన్ నెయ్యి వేసి  సూజి/బొంబాయి  రవను, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
2.పైనాపిల్(స్లైసెస్), చిన్న చిన్న ముక్కలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3.చెక్కర, వేయించిన  రవను  కలిపి  పక్కన పెట్టుకోవాలి.
4. బానలి లో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు ,ద్రాక్ష వేయించాలి.
5. జీడిపప్పు దోరగా  వేగినాక ,2కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.
6.మర్లుతున్న  నీళ్ళలో  చిటికెడు కేసర్ కలర్/కుంకుమ పువ్వు నీళ్ళలో లేక పాల లో కలిపి వేయాలి.
7.తరువాత కేసర్ కలిపిన, మర్లుతున్న నీళ్ళ లో పక్కన  పెట్టుకున్న సూజి+చెక్కర ,వేసి, ఉంటలు లేకుండా కలపాలి.
8.ఏలక్కుల పొడి, తరిగిన పైనాపిల్ ముక్కలు అన్ని వేసి బాగా కలపాలి.
9.కేసర్ కలిపిన నీళ్ళ లో సూజి ,చెక్కర, పైనాపిల్ బాగా కలిసాక , హల్వా లా తయారు అయ్యాక  1 స్పూన్ నెయ్యి వేసి బాగా  కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే  ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ కేసర్ హల్వా రెడి.  

చిట్కా : పైనాపిల్ ముక్కలు (స్లైసెస్) లేకపొతే పైనాపిల్ ఎస్సెన్స్ వేసినా, పైనాపిల్ రుచినే వస్తుంది.
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh