మామిడి పండు- కేసర్ హల్వ (Mango kesar halwa)
![]() |
కావలసిన పదార్థాలు: (ముగ్గురికి సరిపడా) బొంబాయి రవ/ సూజి రవ--- 1 కప్ |
విధానము
1.బానలి లో 1 స్పూన్ నెయ్యి వేసి సూజి/బొంబాయి రవను, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
2.మామిడి పండు రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3.చెక్కర, వేయించిన రవను కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. బానలి లో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు ,ద్రాక్ష వేయించాలి.
5. జీడిపప్పు దోరగా వేగినాక ,2కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.
6.మర్లుతున్న నీళ్ళలో చిటికెడు కేసర్ కలర్/కుంకుమ పువ్వు నీళ్ళలో లేక పాల లో కలిపి వేయాలి.
7.తరువాత కేసర్ కలిపిన,మర్లుతున్న నీళ్ళ లో పక్కన పెట్టుకున్న సూజి+చెక్కర ,వేసి,ఉంటలు లేకుండా కలపాలి.
8.ఏలకుల పొడి,మామిడి పండు రసం కూడా వేసి బాగా కలపాలి.
9.కేసర్ కలిపిన నీళ్ళ లో సూజి ,చెక్కర,మామిడి రసం బాగా కలిసాక , హల్వా లా తయారు అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే మామిడి పండు- కేసర్ హల్వా రెడి.

