కేసర్ బర్ఫీ (Kesar Burphy)
![]() |
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ/ సూజి రవ--- 1 కప్ |
విధానము:
1.బానలి లో1స్పూన్ నెయ్యి వేసి సూజి/బొంబాయి రవను, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
2.చెక్కర, వేయించిన రవను కలిపి పక్కన పెట్టుకోవాలి.
3.ఒక ప్లేట్ కు 1/2 స్పూన్ నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి.
4.బానలి లో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు ,ద్రాక్ష వేయించాలి.
5. జీడిపప్పు దోరగా వేగినాక ,2కప్స్ నీళ్ళు వేసి బాగా మర్లించాలి.
6.మర్లుతున్న నీళ్ళలో చిటికెడు కేసర్ కలర్/కుంకుమ పువ్వు నీళ్ళలో లేక పాల లో కలిపి వేయాలి.
7.తరువాత కేసర్ కలిపిన, మర్లుతున్న నీళ్ళ లో పక్కన పెట్టుకున్న సూజి+చెక్కర వేసి, ఉంటలు లేకుండా కలపాలి.
8.కేసర్ కలిపిన నీళ్ళ లో సూజి ,చెక్కర బాగా కలిసాక , హల్వా లా తయారు అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
9.తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లోకి వేయాలి
10.ఇలా ప్లేట్ లో వేసిన కేసర్ హల్వాను మీకు నచ్చిన విధంగా గుండ్రంగా,స్వ్కయర్,డైమెండ్ ఆకారం లో కట్ చేసుకోవచ్చు.
ఎంతో రుచిగా ఉండే కేసర్ బర్ఫీ రెడి.

