ఫ్రూట్ సలాడ్ (Fruit Salad)
![]() |
కావలసిన పదార్థాలు:
|
విధానము:
1.పండ్లు(ఆపిల్, పైనాపిల్, ద్రాక్ష, పియర్ అరటిపండు) అన్ని చిన్నగా తరిగి ఉంచుకోవాలి
2.గిన్నె లో పాలు వేసి వేడి చేయాలి.
3.కొంచం పాలలో 1 స్పూన్ కస్టర్డ్ కల్పి, వేడి పాలలో వేసి బాగా కలపాలి.
4.తరువాత చెక్కర, కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలపాలి.
5.అన్ని అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి.
6.పాలు కొంచం చిక్కగా అయ్యాక ,జీడిపప్పు, బాదాం, ఏలకులు వేసి 2 నిముషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు కస్టర్డ్ రెడి అయ్యింది

7.కస్టర్డ్ బాగా చల్లగా అయ్యాక ,తరిన పండ్లు వేసి ,బాగా కలిపి , ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయ్యాకా తింటే చాలా బాగుంటుంది.
ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడి
చిట్కా: ఇందులో అన్ని రకాల పండ్లు ఉన్నందున అరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇందులోకి మీకు నచ్చిన అన్ని పండ్లు కూడా వేసుకోవచ్చు.

