గవ్వలు (Gavvalu)
![]() |
కావలసిన పదార్థాలు:
|
విధానము:
1.ఒక గిన్నె లో మైదా,డాల్డ/నెయ్యి,బేకింగ్ పౌడర్,పెరుగు వేసి,కొంచం నీరు వేసి,పూరీ పిండి లా గట్టిగా కలుపుకోవాలి.
2.తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉంటలుగా(బాల్స్ లా) చేసుకోవాలి.
3.చిన్న గా చేసుకున్న ఉంటను , గవ్వల పీట పై పెట్టి వత్తాలి.
4.ఈ విధంగా తయారు చేసుకొన్న గవ్వలను ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.
5.ఒక గిన్నె లో చెక్కర వేసి, చెక్కర మునిగే లా నీరు వేసి, తీగపాకం చేసుకొని,స్టవ్ ఆఫ్ చేసి,చిటికెడు నిమ్మ రసం వేయాలి..(నిమ్మ రసం వేస్తే పాకం చిక్కబడకుండా అలాగే ఉంటుంది)
6. తరువాత నూనె వేడికి పెట్టి,వేడి అయ్యాక,తయారు చేసుకొన్న గవ్వలను వేసి,గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
7.వేయించిన గవ్వలను,పక్కన పెట్టుకొన్న తీగ పాకం లో వేసి,1 లేక 2 నిముషాల తరువాత గవ్వలకు పాకం పట్టాకా,తీసి,ప్లేట్ లో పెట్టుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే గవ్వలు రెడి.
చిట్కా: మీ దగ్గర గవ్వల పీట లేక పోతే ఫొర్క్ ను వాడుకోవచ్చు.

