కారెట్ హల్వ (Carrot Halwa)
![]() |
కావలసిన పదార్థాలు: కారెట్ తురుము----1 గ్లాసు చెక్కర---3/4 గ్లాసు పాలు--1/2 గ్లాస్ నెయ్యి----1/4 గ్లాస్ ఏలకుల పొడి---1/2 స్పూన్ జీడిపప్పు—--10 |
విధానము:
1.బానలి లో నెయ్యి వేసి, కారెట్ తురుము వేసి, దోరగా వేయించాలి.
2.తరువాత పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
3.కారెట్ పాలలో ఉడికి, మెత్తగా అయ్యాక, చెక్కర వేయాలి.
4.చెక్కర,కారెట్ బాగా కలిసి,ముద్దలా అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
5. నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించి హల్వాలో కలపాలి.
ఎంతో రుచిగా ఉండే, కారెట్ హల్వా రెడి.

