జిలేబి (jilebi)
![]() |
కావలసిన పదార్థాలు: మైదా--1 కప్ |
విధానము:
1.ఒక గిన్నెలోమైదా,బియ్యప్పిండి,సోడ,పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
2.ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు
చేసుకోవాలి)
3.తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి.

4.పక్కరోజుకంతా మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది.
5.జారుగా ఉంటేనే జిలేబి బాగా వస్తుంది.

6.తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి.అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.
7.తరువాత ఒక గిన్నె లో చెక్కర వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
8.తరువాత వెడల్పాటి బానలి లోనెయ్యి వేసి, వేడి చేయాలి.
9.తరువాత ప్లాస్టిక్ కవర్ మధ్యలో చిన్న గా రంద్రం చేసి తయారు చేసిన మైదా పిండిని వేయాలి.
10.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి.

11.ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి.
12.ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి 1 నిముషం పాటు ఉంచాలి.
13.తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబి కు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది

ఎంతో రుచిగా ఉండే జిలేబి రెడి.
గమనిక:1.జిలేబీలు చేయడానికి నూనె బదులు నెయ్యి వాడితేనే రుచిగా ఉంటాయి.
2.నెయ్యిలో జిలేబి వేసినప్పుడు నెయ్యిని సన్నటి సెగలో పెట్టాలి, అప్పుడే జిలేబి వేయడానికి వస్తుంది.లేకపోతే జిలేబి వేస్తున్నప్పుడే పైకి వచ్చేసి,వేయడానికి సరిగా రాదు.
3. జిలేబి ప్లాస్టిక్ కవర్తో వేయడం రాకపోతే సాస్ బాటిల్/కొబ్బరి చిప్ప కూడా వాడుకోవచ్చు.

