జాంగ్రీ (Jaangri)
![]() |
కావలసిన పదార్థాలు: మినపప్పు --- 1 గ్లాసు
|
విధానము:
1. మినపప్పు, బియ్యం 1 గంట సేపు నాన పెట్టుకోవాలి.
2.నాన పెట్టిన మినపప్పు,బియ్యం నీరు లేకుండా చిల్లుల గిన్న లో వాడ్చుకోవాలి .
3.బొట్టు కూడా నీరు లేకుండా వాడ్చుకోవాలి .
4.తరువాత నీరు వేయకుండా మినపప్పు, బియ్యం ను కాటుక లా, మెత్తగా రుబ్బుకోవాలి.

5.ఒక గట్టి గా ఉన్న కొత్త బట్టను తీసుకొని దాన్ని రుమాల్ మడిచిన నాలుగు మడతలు పెట్టి, మధ్యలో చిన్న రంధ్రం పెట్టి, గుండీలకు కుట్టినట్టు రంద్రం చుట్టూ కాజా లా కుట్టుకోవాలి.(సాస్ బాటిల్ తో కూడా జాంగ్రీ లా వేసుకోవచ్చు)
6.తరువాత గిన్నె పెట్టి, చెక్కర వేసి కొంచం నీరు వేసి, తీగ పాకం పట్టుకోవాలి.
7.తరువాత పాకం లో చిటికెడు నిమ్మ రసం వేయాలి.(పాకం గట్టిపడ కుండా అలాగే వుంటుంది)
8.ఒక చిన్న గ్లాసు లో, కొంచం పాలు తీసుకొని, అందులో ఎర్ర రంగు కలిపి పాకం లో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
9.తరువాత బానలి పెట్టి నెయ్యి వేసి, వేడి అయ్యాక కాజా కుట్టుకున్న రుమాల్ లో కొంచం కొంచం మినపపిండి వేసుకొని, చుట్లు తిపుతూ , గుండ్రంగా జాంగ్రీ లా వేసుకోవాలి.

10.జాంగ్రీ గోధుమ రంగు వచ్చే లా వేయించి, పాకం లో వేసుకోవాలి.
11.పాకము లో వేసిన జాంగ్రీ పాకం బాగా పీల్చుకొని కొంచం లావు గా అవుతాయి.
అంతే ఎంతో రుచిగా వుండే జాంగ్రీ రెడి

గమనిక :జాంగ్రీ మీకు బట్టలో వేయడం రాకపోతే,సాస్ బాటిలో వేసుకోవచ్చు.లేకపోతే ప్లాస్టిక్ కవర్ కు చిన్న రంద్రం పెట్టి వేసుకోవచ్చు.
2.నెయ్యిలో జాంగ్రీ వేసినప్పుడు నెయ్యిని సన్నటి సెగలో పెట్టాలి, అప్పుడే జాంగ్రీ వేయడానికి వస్తుంది. లేకపోతే జాంగ్రీ వేస్తున్నప్పుడే పైకి వచ్చేసి ,వేయడానికి సరిగా రాదు.

