Website TemplatesJoomla TemplatesWeb Hosting

మేతి పూరీ (Methi Puri)

 

 

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి ---  1 గ్లాసు
మెంతి కూర  --- 1/2 గ్లాసు (చిన్నగా తరిగినది)
పచ్చిమిర్చి --- 3
అల్లం ---చిన్న ముక్క
జీలకర్ర ---1/4 స్పూన్
పసుపు--- చిటికెడు
ఉప్పు --- చిటికెడు
ఇంగువ--- చిటికెడు
నూనె ---  2 స్పూన్స్ 

విధానము:

1.మెంతి కూర చిన్నగ  తరిగి  వుంచుకోవాలి.
2. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర  మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి .
3.తరువాత  ఒక గిన్నె లో గోధుమ పిండి వేసి ,అందులో  2 స్పూన్స్ నూనె వేసి,
చిన్నగా తరిగిన  మెంతి కూర ,ఇంగువ , పసుపు, గ్రైండ్ చేసిన  అల్లం,మిర్చి పేస్ట్ ను వేసి,
కొంచం నీరు వేసుకొని పూరీ పిండి లా కలుపుకోవాలి.
4. ఇలా కలిపిన పిండి ని పూరీ లా చేసుకోవాలి.
5.తరువాత బానలి లో నూనె  పెట్టి  వేడి అయ్యాక, పూరీ లను వేయించుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే మేతి పూరీ రెడి.

చిట్కా:మెంతికూర  చలువ చేస్తుంది. ఇది నడుము నొప్పి,కాళ్ళు, చేతులు ఉబ్బిన వారికి  మెంతి కూర చాలా మంచిది.
మెంతి  ఆకు రుబ్బి, తలకు పట్టిస్తె జుట్టు మృదువుగా ఉంటుంది. 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh