Website TemplatesJoomla TemplatesWeb Hosting

మేతి పరాట (Methi Parata )

methi parata కావలసిన పదార్థాలు:

గోధుమ  పిండి --- 1 గ్లాసు
మెంతికూర  --- 1/2 కట్ట
పచ్చి మిర్చి --- 3
పచ్చి బఠానీలు  --- 1/2 గరిట ( నానపెట్టుకోవాలి)
కొత్తిమీర  ---2 రెమ్మలు
అల్లం ---  చిన్న ముక్క
జీలకర్ర   ---1/4 స్పూన్
గరం మసాల --- 1/4 స్పూన్
దనియాల పొడి ---  1/4 స్పూన్
జీలకర్ర పొడి --- 1/4 స్పూన్
ఉప్పు  --- తగినంత
నూనె ---  2 స్పూన్స్
ఇంగువ ---చిటికెడు
నువ్వులు  ---  1/2  స్పూన్
పసుపు --- చిటికెడు

విధానము:

1.మెంతి కూరను చిన్నగా తరిగి ఉంచుకోవాలి
2.తరువాత పచ్చిమిర్చి,అల్లం కొత్తిమీర,నానపెట్టిన పచ్చిబఠానీలు
  (ఇష్టం లేకపోతే బఠానీలు వేయనవసరం లేదు) , అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
3.తరువాత ఒక బానలి లో 2 స్పూన్స్ ల నూనె  వేసి,కొంచం జీలకర్ర, గ్రైండ్ చేసిన మిర్చి,
  పసుపు ,ఇంగువ, గరం మసాల, జీలకర్ర పొడి, దనియాపొడి, నువ్వులు,తరిగి ఉంచిన మెంతి కూరా,
  అన్ని పచ్చి వాసన పోయేదాక వేయించాలి. 
4.ఒక గిన్నె లో  గోధుమ  పిండి  తీసుకొని  అందులోకి  వేయించిన  మిస్రమాన్నివేసి ,తగినంత ఉప్పు వేసి   బాగ కలపాలి. 
5.తరువాత పిండి అంతా బాగ  కలిసాక  చిన్న చిన్న వుండలు చేసుకొని  చపాతి  లాగ  వత్తుకోవాలి.
6.తరువాత ఇలా చేసిన పరాటా లను పెనం  మీద వేసి కొంచం నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే  మేతి  పరాట రెడి.
మేతి పరాట పెరుగు తో తింటే చాలా బాగుంటుంది

.

methi with curd

 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh