Website TemplatesJoomla TemplatesWeb Hosting

సేమియా పులిహోర (Semiya Pulihora )

semiya pulihoraకావలసిన పదార్థాలు:

సేమియా ---- 1 కప్
వేరు శెనగవిత్తనాలు --- 1 గరిట
పచ్చిమిర్చి --- 4
అల్లం --- చిన్న ముక్క
కరివేపాకు --- 2 రెమ్మలు
పసుపు ---- చిటికెడు
జీడిపప్పు-----10
తిరగమాత గింజలు
నూనె ------3 స్పూన్స్
నిమ్మ రసం-------4 స్పూన్స్
ఉప్పు---- తగినంత

విధానము:
1. వేరు శెనగ  విత్తనాలు  వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. జీడి పప్పు నెయ్యి లో వేయించుకోవాలి.
3.అల్లం, పచ్చిమిర్చి ,కరివేపాకు చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
4.ఒక గిన్నె లో,1 కప్ సేమియా,1 కప్ నీరు, చిటికెడు పసుపు, కొంచం ఉప్పు వేసి బాగ ఉడకనివ్వాలి.
5.ఇలా ఉడికిన  సేమియాను చిల్లుల గిన్నెలో వేసి  నీరు లేకుండా వాడ్చుకోవాలి .
6.బానలి  పెట్టి  కొంచం నూనె  వేసి, 1/2 స్పూన్  ఉద్దిపప్పు,1/2 స్పూన్ శెనగపప్పు,1/2 స్పూన్ ఆవాలు,1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపట మన్నాక, ఇంగువ, కరివేపాకు వేయాలి.
7.తరువాత నీరు  లేకుండా వాడ్చుకున్న సేమియాలోతిరగమాత, వేరుశెనగ విత్తనాలు, జీడిపప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
8.ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు.
పైన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని  తింటే  చాలా బాగుంటుంది.   

ఎంతో రుచిగా ఉండే  సేమియా పులిహోర  రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh