పాలక్ పొంగలి (Paalak Pongali )
|
|
కావలసిన పదార్థాలు: పాలకూర ---- 1 కట్ట |
విధానము:
1. పెసరపప్పు, గోధుమ రవ విడి విడి గా 1/2 గంట నాన పెట్టి వుంచుకోవాలి.
2. ఒక గిన్న లో 2 స్పూన్ నెయ్యి వేసి, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
3.అదే గిన్నె లో 1/2 స్పూన్ ఉద్దిపప్పు ,1/2 స్పూన్ ఆవాలు ,1/2 స్పూన్ జీలకర్ర ,3 ఎండుమిరప, మిరియాలు, చిటికెడు ఇంగువ, అల్లం - వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ,కొత్తిమీర, చిన్నగా తరిగిన పాలకూర కూడ వేసి వేయించాలి.
4. తరువాత 4 గ్లాసుల నీరు వేసి వేడి అయ్యాక , 1/4 స్పూన్ పసుపు వేయాలి.
5. బాగ వుడికినాక అందులోకి నానపెట్టిన 1 గ్లాసు గోధుమ రవ ,1 గ్లాసు నానపెట్టి వుంచిన పెసరపప్పు , ఉప్పు వేసి బాగ ఉడకనివ్వాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పాలక్ పొంగలి రెడి.
