ఆలు పరాటా (Aalu Parata )
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి --- 1 గ్లాసు |
విధానము:
1.గోధుమ పిండిని కొంచం ఉప్పు వేసి, నీళ్ళతో చపాతి పిండి లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత ఆలుగడ్డలు ఉడికించుకోవాలి.
3.ఉడికించిన ఉర్లగడ్డలను తొక్కతీసి, తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
4.తరువాత పచ్చిమిర్చి,అల్లం, కొత్తిమీర, నానపెట్టిన పచ్చి బఠానీలు, అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
5.తరువాత ఒక బానలి లో 2 స్పూన్స్ నూనె వేసి, కొంచం జీలకర్ర, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని, పసుపు,ఇంగువ, గరంమసాల, జీలకర్ర పొడి, ధనియాపొడి, నువ్వులు వేసి అన్ని పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
6.తరువాత తురిమి పెట్టుకున్నఆలుగడ్డ లలో, వేయించి ఉంచుకున్నమిశ్రమాన్నివేసి ,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

7.తరువాత తయరు చేసుకున్న మిశ్రమాన్నిఉండలు చేసుకొని పెట్టుకోవాలి.

8.తరువాత నాని ఉంచిన చపాతి పిండి ను బాగా నాదుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి.

9.తరువాత చపాతి ఉండను చిన్నపూరీలా చేసుకోవాలి.

10.తరువాత చపాతిపై , చేసుకొన్న ఉర్లగడ్డ ఉంటను మధ్యలో పెట్టాలి.

11.తరువాత చపాతి పిండి తో చుట్టాలి.

12.బాల్ లాగా చుట్టాలి. పిండి ఎక్కువ అయితే తీసేయాలి.

13.అంతా ఒకేలా, గుండ్రంగా వుండాలి. లేకపోతే పరాట గట్టిగా వస్తుంది.
14.ఇలా పెట్టి వుంచుకున్నవుంటలను, మైదా పిండి అద్దుకుంటూ, కూర బయటకు రాకుండా చపాతి లాగా చేసుకోవాలి.

15 ఇలా చేసుకున్నఆలుపరాటా ను, పెనం పైన వేసి, కొంచం కాగాక తిప్పి, నూనె పూసి పొంగినాక ,మరొక వైపు కాల్చాలి.

అంతే ఎంతో రుచిగా ఉండే ఆలుపరాటా రెడి.ఈ పరటా పెరుగుతో తింటే చాలా బాగుంటుంది.

చిట్కా:ఆలుగడ్డలు ఉడికినాక ఆ తొక్కలు పడేయకుండా,మసాలాలు వండిన గిన్నెలు,వాసన వస్తుంటాయి కదా,ఆ గిన్నెలను ఆలుగడ్డ తొక్కలతో రుద్దితే వాసన పోతుంది.
