సొరకాయ అప్పాలు (Sorakaya Appalu )
|
|
కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము --- 1 కప్ |
విధానము:
1.శనగపప్పు, 1 గంట సేపు నాన పెట్టుకోవాలి.
2.కారెట్ తురిమి పెట్టుకోవాలి.
3. వేరుశనగ విత్తనాలు, పొడి చేసుకొని పెట్టుకోవాలి.
4.ఉల్లిపాయ,మిర్చి గ్రైండ్ చేసుకోవాలి.
5. ఒక గిన్నె లోకి , సొరకాయ తురుము వేసుకోవాలి
6.తరువాత జీలకర్ర , కొత్తిమీర , పుదీన , కరివేపాకు, ఉప్పు , గ్రైండ్ చేసిన ఉల్లిపాయ+మిర్చి , కారెట్ తురుము ,నానపెట్టిన శనగపప్పు,
వేరు శనక్కాయ పొడి వేసుకొని , బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి.
7.ఇంకా, కారం కావాలనుకునే వారు ఎర్ర కారం వేసుకోవచ్చు .
8. తరువాత బియ్యప్పిండి కూడా వేసి, బాగా కలుపుకోవాలి . నీరు వేయకుండా కలుపుకోవాలి.
9.చిన్నచిన్న వుంటలు గా చేసి, ఒక ప్లాస్టిక్ పేపర్ పైన , చిన్న చిన్న పూరీ లా చేసుకొని, నూనె లో వేయించుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే సొరకాయ అప్పాలు రెడి.

