Website TemplatesJoomla TemplatesWeb Hosting

చపాతి (Chapathi)

chapathi1

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి---3
ఉప్పు ---1 టీస్పూన్(తగినంత )

విధానము:

1.ఒక గిన్నె లో గోధుమ పిండి ,ఉప్పు వేయాలి.
2.చపాతి పిండి లో కొంచం కొంచం నీరు వేస్తూ,మెత్తగా చపాతి పిండి లా కలుపుకోవాలి.
3.ఇలా చేసుకున్న చపాతి పిండి ని, 5 లేక 10 నిముషాలు మూత పెట్టి ఉంచాలి.
4.ఇలా తయారు చేసుకున్న చపాతి పిండి ని ,చిన్న చిన్న ఉంటలు గా చేసుకొని చపాతి పీట పై పల్చగా గుండ్రంగా వత్తుకోవాలి.
5.పెనం పెట్టి , వేడి అయ్యాక ,తయారు చేసుకున్న చపాతి వేసి ,పచ్చిదనం పోయేదాక వుంచాలి.
6.తరువాత వెంటనే చపాతి తిప్పి ,చిన్న చిన్న బుడగలు వచ్చేదాక ఉంచాలి.
7.బుడగలు వచ్చిన వెంటనే తీసి,  గ్యాస్ మంట 
పైన వేయాలి.వేంటనే పూరి లా పొంగుతుంది.(రోటి మేకర్ పైన కుడా వేసుకోవచ్చు)
8.ఇలా పొంగిన చపాతీ  లను గిన్నె లో వేసుకొని, మూత పెట్టుకోవాలి . అప్పుడు చపాతీ లు గట్టిగా  కాకుండ ఉంటాయి.
ఎంతో రుచి గా వుండే ,వేడి వేడి చపాతీలు రెడి.

గమనిక: మీరు కరెంట్ స్టవ్ వాడుతుంటే ,చపాతి కాయిల్  పైన వేస్తే, అంటుకొని పోతుంది. కాబట్టి మెష్ వుండే పాన్ (రోటి మేకర్) వాడడం మంచిది.

చిట్కా:చపాతి మెత్తగా రావాలి అంటే ,పిండి తడిపేటప్పుడు1స్పూన్, నూనె లేక పెరుగు వేస్తే,చపాతీ లు మెత్తగా వస్తాయి.   

Chapathi-4

 

 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh