మూలీ పరాటా (Radish Parata)
|
|
కావలసిన పదార్థాలు: (నలుగురికి సరిపడా) గోధుమ పిండి ---1 గ్లాసు |
విధానము:
1.ముల్లంగి తురిమి పెట్టుకోవాలి.
2.పచ్చిమిర్చి,కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వుంచుకోవాలి.
3.ఒక గిన్నెలో గోధుమ పిండి వేసి ,తగినంత ఉప్పు వేసి చపాతి పిండి లా కలుపుకోవాలి.
4.ముల్లంగి నీరు లేకుండా గట్టిగా పిండి,అందులోకి,తరిగిన కొత్తిమీర,పచ్చిమిర్చి వేసి బాగ కలిపి చిన్న ఉంటలు చేసుకోవాలి.
5.తరువాత కలిపి వుంచిన గోధుమ పిండి తీసుకొని చిన్న పూరీ లా చేసుకోవాలి.
6.ఇలా చేసుకున్న పూరీ ల పైన మూలీ ఉంటను పెట్టి ఒక బాల్ లాగ చుట్టాలి.
7.ఇలా తయారు చేసుకున్న ఉంటను, చపాతి లా వత్తుకోవాలి.
8.తరువాత పెనం పెట్టి, వేడి అయ్యాక, మూలీ పరాటా వేసి కొంచం నూనె/నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
9.పెరుగు లో కొంచం కారం, ఉప్పు వేసుకొని మూలీ పరాటా తో తింటే చాలా బాగుంటుంది.
ఎంతో రుచిగా వుండే మూలీ పరాటా రెడి.
