గోబి పరాటా (Gobi Parata)
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి ---1 గ్లాసు |
విధానము:
1.కాలి ఫ్లవర్ తురిమి పెట్టుకోవాలి.
2.పచ్చిమిర్చి,కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వుంచుకోవాలి.
3.ఒక గిన్నె లో గోధుమ పిండి వేసి ,తగినంత ఉప్పు వేసి చపాతి పిండి లా కలుపుకోవాలి.
4.తరువాత కాలిఫ్లవర్, అందులోకి,తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగ కలిపి చిన్న ఉంటలు చేసుకోవాలి.
5.తరువాత కలిపి వుంచిన గోధుమ పిండి తీసుకొని చిన్న పూరీ లా చేసుకోవాలి.
6.ఇలా చేసుకున్న పూరీ ల పైన కాలిఫ్లవర్ ఉంటను పెట్టి ఒక బాల్ లాగ చుట్టాలి.
7.ఇలా తయారు చేసుకున్న ఉంటను చపాతి లా వత్తుకోవాలి.
8.తరువాత పెనం పెట్టి, వేడి అయ్యాక , గోబి(కాలిఫ్లవర్) పరాటా వేసి , కొంచం నూనె/నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
9.పెరుగు లో కొంచం కారం ,ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఎంతో రుచిగా వుండే గోబి పరాటా రెడి.
