Website TemplatesJoomla TemplatesWeb Hosting

ఆలు పూరీ (Alu Puri)

 

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి ------2 కప్స్
బంగాళ  దుంపలు-----3
పచ్చి మిర్చి----3
పసుపు------చిటికెడు
ఉప్పు-------తగినంత
గరం మసాల ----చిటికెడు
నూనె ---- 2 గ్లాసులు (వేయించడానికి)

విధానము:

1.బంగాళ దుంపలను వుండికించి ,తొక్క తీసి  ,తురిమి పెట్టుకోవాలి.
2. పచ్చి మిర్చి చిన్న గా తరిగి, పసుపు ,ఉప్పు, గరం మసాల కూడా వేసి, బంగాళ దుంపల తురుము లో కలపాలి.
3. ఇలా  కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న వుంటలుగా చేసుకోవాలి.
4.తరువాత గోధుమ పిండి లో ,తగినంత ఉప్పు వేసి పూరీ  పిండి లా కలుపుకోవాలి.
5.తరువాత చిన్న పూరీ చేసుకొని, దానిపై తయారు చేసుకున్న బంగాళ దుంప ఉంటను పెట్టి
ఒక బాల్ లాగ  చుట్టి , పూరీ లా చేసుకోవాలి.(బంగాల దుంప ఉంటను పూరీ  పిండి తో అన్ని వైపులా చుట్టాలి)
6.తరువాత నూనె పెట్టి ,వేడి అయ్యాక పూరీలు వేయించుకోవాలి.
 ఎంతో రుచిగా వుండే ఆలు పూరీ  రెడి .ఈ పూరీలు  రైతా తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh