సొరకాయ (లోకి) పూరీ (Loki Puri)
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి ---1 గ్లాసు |
విధానము:
1.సొరకాయ చెక్కు తీసి, తురిమి పెట్టుకోవాలి.
2.పచ్చిమిర్చి,కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వుంచుకోవాలి.
3.తరువాత సొరకాయ తురుము ,చిన్నగా తరిగిన కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసి ,బాగ కలపాలి.
అందులోనే గోధుమ పిండి ,తగినంత ఉప్పు వేసి, పూరీ పిండి లా బాగ కలుపుకోవాలి. (నీరు వేయకుండా కలుపుకోవాలి)
4.ఇలా తయారు చేసుకున్న పిండి ని , పూరీ లా వత్తుకోవాలి.
5.తరువాత నూనె పెట్టి , వేడి అయ్యాక, సొరకాయ పూరీ లను వేసి వేయించాలి.
అంతే ఎంతో రుచిగా వుండే వేడి వేడి సొరకాయ(లోకి)పూరీ రెడి.
ఈ పూరీ లు బూంది రైతా తో తింటే చాలా బాగుంటాయి.(పెరుగు లో బూంది,కొంచం ఉప్పు వేసి కలిపితే అది బూంది రైతా)
