Website TemplatesJoomla TemplatesWeb Hosting

పాలక్ పూరీ (Palak Puri)

 

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి ------1 గ్లాసు
పాలకూర -----1/2 కట్ట
పచ్చి మిర్చి----3
అల్లం----- చిన్న ముక్క
పసుపు------చిటికెడు
జీలకర్ర-----1/4 స్పూన్
ఉప్పు-------తగినంత
ఇంగువ-----చిటికెడు
నూనె ------ 2 స్పూన్స్
నూనె----------- 2 కప్స్(వేయించడానికి)

విధానము:
1. పాలకూర ను చిన్న గా  తరిగి ఉంచుకోవాలి.
2.పచ్చి మిర్చి, అల్లం, జీలకర్ర  గ్రైండ్ చేసుకోవాలి.
3.ఒక గిన్నె లో గోధుమ పిండి తీసుకొని,అందులోకి 2 స్పూన్స్ నూనె,ఇంగువ, పసుపు,తరిగిన పాలకూర,
గ్రైండ్ చేసిన మిర్చి-అల్లం పేస్ట్ ,తగినంత ఉప్పు వేసి బాగ కలపాలి.
4.కలుపుకున్న  మిశ్రమాన్ని , నీరు వేసి , పూరీ పిండి లా కలుపుకోవాలి.
5.తయారు చేసుకున్న పూరీ పిండి, చిన్న చిన్న వుంటలు గా చేసుకొని,పూరీ లా వత్తుకోవాలి.
6.తరువాత నూనె పెట్టి ,వేడి అయ్యాక , పూరీలను  వేయించుకోవాలి.
అంతే  ఎంతో రుచిగా వుండే పాలక్ పూరీ రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh