కొత్తిమీర పరాట (Coriander Parata)
|
|
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి ---1 గ్లాసు |
విధానము:
1.పచ్చిమిర్చి, అల్లం, 1/2 కట్ట కొత్తిమీర , గ్రైండ్ చేసుకోవాలి.
2.తరువాత గోధుమ పిండి లో , చిన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర , గ్రైండ్ చేసిన కొత్తిమీర +పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి.
3.అందులోనే తగినంత ఉప్పు వేసి చపాతి పిండి లా బాగా కలుపుకోవాలి.
4.ఇలా తయారు చేసుకున్న పిండి చపాతి లా వత్తుకోవాలి.
5.తరువాత పెనం పెట్టి , వేడి అయ్యాక, కొత్తిమీర పరాట లను వేసి కొంచం నూనె/నెయ్యి వేసి ,
రెండు వైపులా కాల్చుకోవాలి.
అంతే ఎంతో రుచి గా వుండే వేడి వేడి కొత్తిమీర పరాట రెడి .
ఈ పరాట బూంది రైతా తో లేక పెరుగు తో తింటే చాలా బాగుంటుంది.

