Website TemplatesJoomla TemplatesWeb Hosting

రవ పొంగలి (Rava Pongali)

 Rava Pongali

కావలసిన పదార్థాలు:

గోధుమ రవ/ఉప్మా రవ----1 కప్
పెసర పప్పు----1/2 కప్
నల్ల మిరియాలు పొడి---1 స్పూన్
ఉప్పు----తగినంత
నెయ్యి----4 స్పూన్స్
కరివేపాకు---5 లేక 10
జీడిపప్పు---10 లేక 15
ఇంగువ-- చిటికెడు
జీలకర్ర---1 స్పూన్
అల్లం---చిన్న ముక్క 

విధానము:

1.ఉప్మా రవ  వేయించాలి. అల్లం తురుము కోవాలి.
2.బానలి పెట్టి,2 స్పూన్స్ నెయ్యి వేసి, వేడి అయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి తరువాత పెసర పప్పు వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
3.తరువాత జీడిపప్పు, అల్లం తురుము వేసి 1 నిముషము వేయించాలి.
4.తరువాత 3 కప్స్ నీళ్ళు వేసి బాగా ఉడకనివ్వాలి.
5.పెసరపప్పు,నీళ్ళు బాగా ఉడికేటప్పుడు,1/2 స్పూన్  మిరియాల పొడి, ఉప్పు, ఉప్మా రవ వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
6.తరువాత తయారైన రవ పొంగలి లో 2 స్పూన్స్ నెయ్యి ,1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ,బాగా కలిపి మూత పెట్టి,5 నిముషాల తరువాత తింటే  చాలా బాగుంటుంది.

అంతే ఎంతో రుచిగా  ఉండే రవ పొంగలి రెడి. రవ  పొంగలి కొబ్బరి చట్నీ తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh