పుచ్చకాయ దోసా (Watermelon Dosa)
|
|
కావలసిన పదార్థాలు: బియ్యం ---1 కప్ |
విధానము:
1.బియ్యము 1 గంట నాన పెట్టాలి.
2.పుచ్చకాయ ముక్కలు, బియ్యము, కొబ్బెర మెత్తగా గ్రైండ్ చేయాలి.
3.గ్రైండ్ చేసిన పిండి ని ఒక గిన్నె లో తీసుకొని ఉప్పు వేయాలి.
4. పిండి కొంచం జారుగా ఉండాలి.
5.పెనం పెట్టి, వేడి అయ్యాక చేతితో గ్రైండ్ చేసిన పిండి ని తీసుకొని పెనం మీదా చిలకరించాలి.(ఈ దోసా గరిట తో వేస్తే సరిగ్గా రాదు)
6.తరువాత 1 స్పూన్ నూనె ,దోసా చుట్టు వేయాలి.
7.దోసా 2 నిముషాలు ఉంచి కాలనివ్వాలి.
8.తరువాత దోసా తిప్పి రెండో వైపు కూడా కాలనివ్వాలి.
ఎంతో రుచిగా ఉండే, కర కరలాడే పుచ్చకాయ దోసా రెడి.
