ఉల్లిపాయ రవ దోసా (Onion Rava Dosa)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.గిన్నె లో మైదా, బియ్యప్పిండి, బొంబాయి రవ. సూజి, జీలకర్ర, చిన్నగా ,ఉప్పు ఎర్ర కారం, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి నీరు వేసి (4 లేక 5 కప్స్ నీళ్ళు)బాగా కలపాలి.
2.పిండి కొంచం జారుగా చేసుకోవాలి.
3.1 స్పూన్ నూనె వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా వేయించాలి.
4.పచ్చి మిర్చి, కొత్తిమీర చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
5. పెనం పెట్టి, వేడి అయ్యాక చేతితో, జారుగా కలిపిన పిండి ని తీసుకొని పెనం మీద, ఒకే విధంగా చిలకరించాలి.
(ఈ దోసా గరిట తో వేస్తే సరిగ్గా రాదు)
6.తరువాత 1 స్పూన్ నూనె దోస చుట్టు వేయాలి.
7.దోసా 2 నిముషాలు ఉంచి కాలనివ్వాలి.
8.తరువాత గోధుమ రంగు గా కాలిన దోస పైన దోరగా వేయించిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి, దోసను మధ్యకు మడచాలి.
9. తరువాత మడిచిన రవ దోసను ప్లేట్ లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే కర కరలాడే ఉల్లిపాయ రవ దోసా రెడి.
