Website TemplatesJoomla TemplatesWeb Hosting

రవ మసాల దోసా (Rava Masala Dosa)

Rava Masala Dosa 

కావలసిన పదార్థాలు:
మైదా ---1/2 కప్
బియ్యప్పిండి---1 కప్
సూజి/బొంబాయి రవ---1/2 కప్
ఉప్పు----తగినంత
పచ్చి మిర్చి---3
ఎర్ర కారం----1/2 స్పూన్
ఆలు గడ్డలు --4
ఉల్లిపాయలు---3 చిన్నవి
అల్లం--చిన్న ముక్క
పసుపు---1/2 స్పూన్
తిరగమాత గింజలు:
ఉద్దిపప్పు, శనగ పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ
కొత్తిమీర---2 రెమ్మలు
కరివేపాకు---2 రెమ్మలు

కూర  చేసుకొనే విధానము :

1.ఆలు గడ్డలు ఉడికించి , తొక్క తీసుకోవాలి.
2.ఉల్లిపాయలు,పొడవుగా తరిగి ఉంచుకోవాలి.
3.పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.
4.బానలి పెట్టి,2 స్పూన్స్ నూనె వేసి, తిరగమాత గింజలు (అన్ని 1/2 స్పూన్ ) వేసుకోవాలి.
5.ఆవాలు చిట చిట  అన్నాకా,  పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి.
6.తగినంత ఉప్పు  కూడా  వేయాలి.
7.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక,  తొక్క తీసిన అలు గడ్డలను, చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఉప్పు తక్కువ  ఐతే వేసుకొని, బాగా కలపాలి.
8.చివరి లో కరివేపాకు ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.

అంతే  రవ మసాల దోసకు ఆలుగడ్డ కూర రెడి

రవ మసాల దోసా విధానము:

1.గిన్నె లో మైదా, బియ్యప్పిండి, బొంబాయి రవ. సూజి, జీలకర్ర, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి, ఉప్పు,
ఎర్ర కారం ,చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి నీరు వేసి బాగా కలపాలి.
2.పిండి కొంచం జారుగా  చేసుకోవాలి.

rava dosa mix

 
3.పెనం పెట్టి ,వేడి అయ్యాక చేతితో, జారుగా కలిపిన పిండి ని తీసుకొని పెనం మీదా, ఒకే  విధంగా చిలకరించాలి.(ఈ దోసా గరిట తో వేస్తే సరిగ్గా రాదు)
4.తరువాత 1 స్పూన్ నూనె దోసా చుట్టూ వేయాలి.
5. దోస 2 నిముషాలు ఉంచి కాలనివ్వాలి.
6. ఒకవేలా దోస పచ్చిగా ఉంటే, ఎర్రగా కాలేంత వరకు ఉంచాలి.
7.తరువాత ఎర్రగా కాలిన దోస పై, తయారు చేసుకున్న, ఆల్లుగడ్డ కూరను పెట్టి, దోస ను మడుచుకోవాలి.
8.దోసా బాగా కాలినాకా ప్లేట్  లో తీసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే కర కరలాడే  మసాల రవ దోసా రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh