మసాల దోసా (Masala Dosa)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
కూర చేసుకొనే విధానము:
1.ఆలు గడ్డలు ఉడికించి ,తొక్క తీసుకోవాలి.
2.ఉల్లిపాయలు,పొడవుగా తరిగి ఉంచుకోవాలి.
3.పచ్చి మిర్చి అల్లం, కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.
4.బానలి పెట్టి,2 స్పూన్స్ నూనె వేసి,తిరగమాత గింజలు (అన్ని 1/2 స్పూన్ ) వేసుకోవాలి.
5.ఆవాలు చిట చిట అన్నాకా,పొడవుగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి, వేయాలి.
6.తగినంత ఉప్పు కూడా వేయాలి.
7.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక, తొక్క తీసిన అలు గడ్డలను,చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఉప్పు తక్కువ ఐతే వేసుకొని, బాగా కలపాలి.
8.చివరి లో కరివేపాకు ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.
అంతే మసాల దోసకు ఆలుగడ్డ కూర రెడి.
మసాల దోసా చేసుకునే విధానము:
1.పెనం వేడి కి పెట్టాలి.
2.పెనం వేడి అయ్యాక దోస పిండి తో గుండ్రంగా దోసలా వేసుకోవాలి.
3.దోస పైన 2 స్పూన్స్ నూనె వేసి ,దోస గోధుమ రంగు వచ్చేలా కాల్చాలి.
4.తరువత గోధుమ రంగుగా కాల్చిన దోస పై, తయారు చేసుకున్న ఆలుగడ్డ కూర పెట్టి, దోసను మధ్యకు మడచాలి.
ఎంతో రుచిగా ఉండే మసాల దోసా రెడి.
ఈ దోసా, వేరుశనగ పచ్చడి/కొబ్బరి పచ్చడి/సాంబార్ తో తింటే చాలా బాగుంటుంది.
