Website TemplatesJoomla TemplatesWeb Hosting

మైసూర్ మసాల దోసా (Mysore Masala Dosa)

Masala Dosa 

కావలసిన పదార్థాలు:
దోస పిండి--4 కప్స్
ఆలు గడ్డలు --4
ఉల్లిపాయలు---3 చిన్నవి
పచ్చి మిర్చి---4
అల్లం--చిన్న ముక్క
పసుపు---1/2 స్పూన్
నూనె----చిన్న గరిట

తిరగమాత గింజలు:
ఉద్దిపప్పు, శనగ పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ
కొత్తిమీర---2 రెమ్మలు
కరివేపాకు---2 రెమ్మలు
పప్పుల పచ్చడికి కావలసిన పదార్థాలు:
పప్పులు----1/2 కప్
కొబ్బరి తురుము----1/2 కప్
పచ్చి మిర్చి---4
చింతపండు రసం----1/2 స్పూన్
ఉప్పు----తగినంత

విధానము:

పచ్చడి విధానం:

మిక్సీ జార్ లో పప్పులు, కొబ్బెర, పచ్చి మిర్చి, చింతపండు రసం ,ఉప్పు అన్నీ వేసి, గ్రైండ్ చేయాలి.
2.కొంచం నీరు కూడా వేసి, మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి.
అంతే పప్పుల పచ్చడి రెడి.

కూర చేసుకొనే విధానము:

1.ఆలు గడ్డలు ఉడికించి ,తొక్క తీసుకోవాలి.
2.ఉల్లిపాయలు,పొడవుగా తరిగి ఉంచుకోవాలి.
3.పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.
4.బానలి పెట్టి,2 స్పూన్స్ నూనె వేసి, తిరగమాత గింజలు (అన్ని 1/2 స్పూన్ ) వేసుకోవాలి.
5.ఆవాలు చిట చిట అన్నాకా, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పసుపు వేయాలి.
6.తగినంత ఉప్పు కూడా వేయాలి.
7.ఉల్లిపాయలు ఎర్రగా  వేగినాక, తొక్క తీసిన అలు గడ్డలను,చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఉప్పు తక్కువ  ఐతే వేసుకొని, బాగా కలపాలి.
8.చివరి లో కరివేపాకు ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.

అంతే మైసూర్ మసాల దోసకు ఆలుగడ్డ కూర రెడి

మైసూర్ మసాల దోస చేసుకొనే విధానము:

1.పెనం వేడి కి పెట్టాలి.
2.పెనం వేడి అయ్యాక దోస పిండి తో గుండ్రంగా దోసలా వేసుకోవాలి.
3.దోస పైన 2 స్పూన్స్ నూనె వేసి, దోస గోధుమ రంగు . వచ్చేలా కాల్చాలి.
4.తరువత గోధుమ రంగుగా కాల్చిన దోస పై తయారు చేసుకున్న పప్పుల పచ్చడి ని పూయాలి.
5.పప్పుల పచ్చడి పూసిన దోస పై, ఆలుగడ్డ  కూర పెట్టి, దోసను మధ్యకు మడచాలి.

ఎంతో రుచిగా ఉండే  మైసూర్ మసాల దోసా రెడి.

ఈ దోసా,వేరుశనగ పచ్చడి/కొబ్బరి పచ్చడి/సాంబార్ తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh