Website TemplatesJoomla TemplatesWeb Hosting

రాయలసీమ మసాల దొసా (Rayalaseema Masala Dosa)

Masala Dosa 

కావలసిన పదార్థాలు:
దోస పిండి--4 కప్స్
ఆలు గడ్డలు --4
ఉల్లిపాయలు---3 చిన్నవి
పచ్చి మిర్చి---4
అల్లం--చిన్న ముక్క
పసుపు---1/2 స్పూన్
పప్పుల పొడి---4
నూనె----చిన్న గరిట

తిరగమాత గింజలు:
ఉద్దిపప్పు,శనగ పప్పు,జీలకర్ర,ఆవాలు,ఇంగువ
కొత్తిమీర---2 రెమ్మలు
కరివేపాకు---2 రమ్మలు
ఉల్లికారము కు కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ--2 చిన్నవి
ఎండు మిరప----3
టమొటా--1/2
చింతపండు రసం---1/2 స్పూన్
ఉప్పు ----తగినంత

విధానము:

ఉల్లికారము చేసుకొనే పద్ధతి:
1.మిక్సీ జార్ లో తరిగిన ఉల్లిపాయలు,ఎండుమిరపకాయలు,చింతపండు రసం,ఉప్పు,టమొటా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2.పచ్చడి నీరుగా ఉంటే, బానలి లో 1/2 నూనె వేసి, నీరు ఇంకి పోయేంత వరకు వేయించుకోవాలి.
అంతే ఉల్లికారం రెడి.

కూర చేసుకొనే విధానము:

1.ఆలు గడ్డలు ఉడికించి ,తొక్క తీసుకోవాలి.
2.ఉల్లిపాయలు,పొడవుగా తరిగి ఉంచుకోవాలి.
3.పచ్చి మిర్చి,అల్లం,కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.
4.బానలి పెట్టి,2 స్పూన్స్ నూనె వేసి,తిరగమాత గింజలు (అన్ని 1/2 స్పూన్ ) వేసుకోవాలి.
5.ఆవాలు చిట చిట అన్నాకా,పొడవుగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,పసుపు వేయాలి.
6.తగినంత ఉప్పు కూడా వేయాలి.
7.ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక,తొక్క తీసిన అలు గడ్డలను,చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఉప్పు తక్కువ  ఐతే వేసుకొని, బాగా కలపాలి.
8.చివరి లో కరివేపాకు ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.
అంతే మసాల దోస కు ఆలుగడ్డ కూర రెడి

రాయలసీమ మసాల దొసా చేసుకునే విధానము:

1.పెనం వేడి కి పెట్టాలి.
2.పెనం వేడి అయ్యాక దోస పిండి తో గుండ్రంగా దోసలా వేసుకోవాలి.
3.దోస పైన 2 స్పూన్స్ నూనె వేసి,దోస గోధుమ రంగు . వచ్చే లా కాల్చాలి.
4.తరువత గోధుమ రంగుగా కాల్చిన దోస పై తయారు చేసుకున్న ఉల్లికారము పూయాలి.
5.ఉల్లికారము పూసిన దోస పై, 1/4 స్పూన్ పప్పుల పొడి చల్లాలి.
6తరువాత ఆలుగడ్డ కుర్ర పెట్టి,దోసను మధ్యకు మడచాలి.
7.ఈ విధంగా తయారు చేసుకున్న దోసను ప్లేట్ లో తీసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే రాయలసీమ మసాల దోసా రెడి.
ఈ దోసా,వేరుశనగ పచ్చడి/కొబ్బరి పచ్చడి/సాంబార్ తో తింటే చాలా బగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh