Website TemplatesJoomla TemplatesWeb Hosting

కారెట్ - బఠానీలు పెసరట్టు (Carrot Peas Pesarattu)

Carrot Peas Pesarattu 

కావలసిన పదార్థాలు:
పెసలు---2 కప్స్
బియ్యం---1/2 కప్
కారెట్ తురుము--4 స్పూన్స్
పచ్చి బఠానీలు---4 స్పూన్స్ 
అల్లం---చిన్న ముక్క
పచ్చి మిర్చి---5
జీలకర్ర---1 స్పూన్
ఉప్పు---తగినంత

విధానము:
1.పెసలు,బియ్యము 4 గంటలు నాన పెట్టాలి.
2.అల్లం,పచ్చి మిర్చి తరిగి ఉంచుకోవాలి.
3.నానపెట్టిన పెసలు+బియ్యము, అల్లము, పచ్చి మిర్చి ,పచ్చి బఠానీలు వేసి కొంచం నీరు వేసి, దోస పిండిలా రుబ్బు కోవాలి.
4.రుబ్బిన పిండి లో సరిపడా ఉప్పు, జీలకర్ర ,కారెట్ వేసి పిండి బాగా కలపాలి.
5.పెనం వేడికి పెట్టి, వేడి అయ్యాక, తయారు చేసుకున్న పిండిని  దోసలా వేసుకొని , దోస చుట్టూ 1/2 స్పూన్ నూనె వేసి, ఎర్ర గా కాల్చాలి.

ఎంతో రుచిగా ఉండే కారెట్ -పీస్ పెసరట్టు రెడి. ఈ దోసా అల్లం పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

చిట్కా: పెసరట్టు కర కర రావాలి అనుకుంటే, 1/2 గ్లాసు బియ్యం ఎక్కువ వేసుకోవాలి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh